
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్థలాలను వదిలిపెట్టి ప్రైవేట్ స్థలాల్లో కలెక్టరేట్ ఎలా నిర్మిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డికి అనుకూలంగా ఉన్న ప్రైవేట్ భూముల్లో సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం చేపడుతున్నారని, ఇందులో దాదాపు రూ.200 కోట్ల అక్రమాలు దాగున్నాయని ఆరోపించారు. మంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ప్రభుత్వ భవనాలను ప్రైవేట్ స్థలంలో నిర్మిస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment