
సాక్షి, హైదరాబాద్: మండల స్థాయిలోనూ మహిళా కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటుచేయనున్నట్లు టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే 31 జిల్లాలకు మహిళా కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటుచేశామన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆమోదంతోనే అన్ని జిల్లాల్లో కమిటీలను నియమించినట్టుగా చెప్పారు.
ఈ నెల 8న మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం గాంధీభవన్‌లో జరగనుందని.. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియాతో పాటు ముఖ్యనేతలు హాజరవుతారని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోతోందని, అకృత్యాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. వీటిపై మహిళా కాంగ్రెస్ పోరాడుతుందని శారద చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment