Nerella saradha
-
మేనిఫెస్టో కమిటీకి కూలీల సమస్యలు: నేరెళ్ల
సాక్షి, హైదరాబాద్: వివిధ వర్గాల ప్రజల సమస్యలను టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద అడిగి తెలుసుకున్నారు. ఆదివారం దినసరి వేతన కూలీలు, వీధి వ్యాపారులు, కార్మికులు, ఇళ్లు, హాస్టళ్లలో పనిచేసే తదితర కూలీలతో ఆమె గాంధీ భవన్లో సమావేశం నిర్వహించారు. అలాగే హెచ్ఐవీ రోగులతోనూ ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారంతా కాంగ్రెస్ నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకుని, వారి సమస్యల్ని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి పంపుతున్నట్లు ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. -
కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తాం: నేరెళ్ల శారద
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రాష్ట్రం లోని మహిళలందరం కృషిచేస్తామని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద అన్నారు. కేబినెట్లోకి కనీసం ఒక్క మహిళను కూడా తీసుకోకుండా అగౌరవపర్చిన కేసీఆర్కు తగిన బుద్ధి చెప్పేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సోమవారం గాంధీభవన్లో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాళ్లు, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, పట్టణ అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో మహిళా కాం గ్రెస్ నిర్వహించాల్సిన పాత్రపై చర్చించి కార్యాచరణ రూపొందించారు. మహాకూటమి అభ్యర్థుల గెలుపు కోసం మహిళా కాంగ్రెస్ నేతలంతా కృషి చేయాలని ఆమె సూచించారు. సమావేశంలో ఆలిండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెన్నెట్ డిసౌజా, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఇన్చార్జి చమన్ ఫర్జానా పాల్గొన్నారు. -
మండల స్థాయిలోనూ కమిటీలు
సాక్షి, హైదరాబాద్: మండల స్థాయిలోనూ మహిళా కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటుచేయనున్నట్లు టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే 31 జిల్లాలకు మహిళా కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటుచేశామన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆమోదంతోనే అన్ని జిల్లాల్లో కమిటీలను నియమించినట్టుగా చెప్పారు. ఈ నెల 8న మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం గాంధీభవన్లో జరగనుందని.. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియాతో పాటు ముఖ్యనేతలు హాజరవుతారని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోతోందని, అకృత్యాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. వీటిపై మహిళా కాంగ్రెస్ పోరాడుతుందని శారద చెప్పారు. -
‘ ఆ మంత్రి పదవికి అనర్హుడు’
హైదరాబాద్సిటీ: తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి పదవికి లక్ద్మారెడ్డి అనర్హుడని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. బాలింతలు సరైన వైద్యం అందక చనిపోతుంటే ప్లీనరీ పేరుతో ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. టీఎస్ఎంఐడీసీ మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. నాసిరకం మందులు సరఫరా చేస్తూ జనం ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. కోఠి మెటర్నిటీ మరణాలకు సూపరిండెంట్ శైలజ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు