
సాక్షి, హైదరాబాద్: వివిధ వర్గాల ప్రజల సమస్యలను టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద అడిగి తెలుసుకున్నారు. ఆదివారం దినసరి వేతన కూలీలు, వీధి వ్యాపారులు, కార్మికులు, ఇళ్లు, హాస్టళ్లలో పనిచేసే తదితర కూలీలతో ఆమె గాంధీ భవన్‌లో సమావేశం నిర్వహించారు. అలాగే హెచ్‌ఐవీ రోగులతోనూ ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారంతా కాంగ్రెస్ నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకుని, వారి సమస్యల్ని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి పంపుతున్నట్లు ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.