సాక్షి, న్యూఢిల్లీ: రాఫెల్ డీల్ ప్రధాని మోదీకి అనిల్ అంబానీకి మధ్య కుదిరిన ఒప్పందమని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి ఎస్.జైపాల్‌రెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘2015 ఏప్రిల్ 15న రాఫెల్ ఒప్పందం కుదిరింది. దీనికి రెండు రోజుల ముందు కూడా విదేశాంగ కార్యదర్శికి ఈ విషయం తెలియదు. నాటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఫ్రాన్స్‌లో లేరు. డీల్‌పై సంతకం అయ్యాక పారికర్ చేసిన ప్రకటన చూస్తే ఆయన ఆ డీల్‌కు కావాలనే దూరంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.
ఈ ఒప్పందం భారత ప్రధాని, ఫ్రాన్స్ అధ్యక్షుడి మధ్య కుదిరిన ఒప్పందంగా పారికర్ చెప్పారు. అయితే ఈ దేశంలో ప్రధాని కాకుండా ఈ ఒప్పందం జరుగుతుందని తెలిసిన మరో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క అనిల్ అంబానీ మాత్రమే’ అని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒప్పందానికి సరిగ్గా 12 రోజుల ముందు అనిల్ అంబానీ తన కంపెనీని రిజిస్టర్ చేయించారని వివరించారు. అంటే 12 రోజుల ముందే ఈ ఒప్పందం కుదురుతుందని, అది తనకే దక్కుతుందని అనిల్ అంబానీకి తెలుసని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment