
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
కరీంనగర్: జిల్లాను ఏడు ముక్కలు చేసిన టీఆర్‌ఎస్‌ను ఓడించాలని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో పొన్నం విలేకరులతో మాట్లాడుతూ..ఒకరు ధన బలంతో, మరొకరు మతాన్ని అడ్డు పెట్టుకుని గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ సారి కరీంనగర్‌లో కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. గతంలో కరీంనగర్ ప్రజలకు తామిచ్చిన హామీలన్నీ నేరవేర్చామని చెప్పారు. కానీ కరీంనగర్‌లో టీఆర్‌ఎస్ సర్కార్ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని తీవ్రంగా మండిపడ్డారు.
కరీంనగర్ కోసం స్థానిక మేధావులతో కలిసి లోకల్ మేనిఫెస్టో తెస్తామని వెల్లడించారు. టీఆర్‌ఎస్‌లోని ఉప ముఖ్యమంత్రి స్థాయి నేతలతో పాటు పలువురు ఐఏఎస్‌లు కూడా కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని తెలిపారు. నియంత దగ్గర ఉండలేమన్న భావన చాలా మంది టీఆర్‌ఎస్ నేతల్లో ఉందన్నారు. ఈ సారి ప్రభుత్వ మార్పిడి ఖాయమని జోస్యం చెప్పారు. అమావాస్య నాడు జరిగే ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటమి ఖాయమవుతుందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment