సాక్షి, కరీంనగర్: టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో ఏపీ నాయకుల అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా టీఆర్‌ఎస్ డ్రామాలాడుతోందన్నారు. ముస్లిం రిజర్వేషన్ సాకుగా చూపి అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం లేదని.. అంత చిత్తశుద్ధి ఉంటే రాబోయే ఎన్నికల్లో పోటీచేయమని ప్రకటించండని ఆయన తెలిపారు. పక్కింట్లో పెళ్లైతే మన ఇంట్లో సున్నం వేసుకుంటామా అన్నట్టుగా టీఆర్‌ఎస్ ఎంపీలు మాట్లాడుతున్నారన్నారు.
60 ఏళ్లు తమతో కలిసి ఉన్న సోదరులపై మనం చూపే సంస్కారం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలపై పార్లమెంట్‌లో ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. మరోపక్క అసెంబ్లీ మౌనంగా ఉన్న ఎమ్మెల్యేలను సైతం బయటకు పంపడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. కేటీఆర్ చెబితేనే పర్సంటేజ్‌లు తీసుకుంటామని చెప్పిన సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌పై వేటు వేసినప్పడు కేటీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఆయన స్థానంలో మరో మంత్రి ఉంటే ఊరుకునేవారా అని ఆయన నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment