
సాక్షి, ఖమ్మం : రాష్ట్రంలో 28 మంది విద్యార్థులను పొట్టనపెట్టుకున్న పాపం కేసీఆర్‌దే అంటూ కాంగ్రెస్ మాజీ మంత్రి రేణుకా చౌదరి మండిపడ్డారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇంటర్ బోర్టు ఘటన టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనకు నిదర్శనమన్నారు. ఇంటర్‌బోర్డు అవకతవకలపై ప్రభుత్వ తీరును ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యానికి అద్దం పట్టేలా ఖమ్మం పార్లమెంట్ ఎన్నిక జరిగిందని తెలిపారు.
జిల్లాలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దేశంలో నేటి అభివృద్ధి.. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణల పుణ్యమే అన్నారు. 23న కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని ఆమె స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment