సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో 443 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్లు దాఖలు చేసిన 503 మందిలో 60 మంది ఉపసంహరించుకోవడంతో చివరకు 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 185 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 189 మంది నామినేషన్ వేయగా నలుగురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ నలుగురిలో ముగ్గురు రైతులు, మరొకరు స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి 28 మంది పోటీలో నిలిచారు.
నియోజకవర్గం | దాఖలైన నామినేషన్లు | ఉపసంహరించుకున్న నామినేషన్లు | తుది పోటీలో నిలిచిన అభ్యర్థులు |
ఆదిలాబాద్ (ఎస్టీ) | 13 | 2 | 11 |
పెద్దపెల్లి (ఎస్సీ) | 17 | 0 | 17 |
కరీంనగర్ | 16 | 1 | 15 |
నిజామాబాద్ | 189 | 4 | 185 |
జహీరాబాద్ | 18 | 6 | 12 |
మెదక్ | 18 | 8 | 10 |
మల్కాజ్‌గిరి | 13 | 1 | 12 |
సికింద్రబాద్ | 30 | 2 | 28 |
హైదరాబాద్ | 19 | 4 | 15 |
చేవెళ్ల | 24 | 1 | 23 |
మహబూబ్‌నగర్ | 12 | 0 | 12 |
నాగర్‌కర్నులు(ఎస్సీ) | 12 | 1 | 11 |
నల్లగొండ | 31 | 4 | 27 |
భువనగిరి | 23 | 10 | 13 |
వరంగల్ (ఎస్సీ) | 21 | 6 | 15 |
మహబూబాబాద్(ఎస్టీ) | 18 | 4 | 14 |
ఖమ్మం | 29 | 6 | 23 |
మొత్తం | 503 | 60 | 443 |
Comments
Please login to add a commentAdd a comment