మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
కామారెడ్డి టౌన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని మోసగిస్తూ, ప్రజావ్యతిరేఖ విధానాలతో పాలన సాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని గంజువర్తక సంఘంలో జరిగిన సీపీఐ జిల్లా ముఖ్య కార్యకర్తల జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పీఎం నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అంటూ చస్తున్న భారత్‌గా తయారు చేస్తున్నారని ఆరోపించారు. కూడు, గుడ్డ, నీడ, పేదల హక్కు అని, కానీ దేశంలో ఓటు హక్కు మాత్రమే అమలవుతుందని అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదన్నారు. నల్లధనం అంతం చేస్తామని చెప్పి అవీనీతి ప్రభుత్వంగా కేంద్రం మారిందన్నారు. దళితులు, ముస్లింలపై దాడులు అగడం లేదని ఆరోపించారు.
నిరుద్యోగుల కోసం 2కోట్ల ఉద్యోగాలు, 10లక్షలకోట్ల క్రాఫ్ లోన్స్ హామీ ఎమైందన్నారు. నిత్యవసర ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మోడి ప్రభుత్వాన్ని మించి మాటల గారడి చేస్తుందన్నారు. 1200 ఆత్మబలిదాన వల్ల తెలంగాణ వస్తే వాటి ఫలితాలు అనుభవిస్తుంది కేసీఆర్ కుటుంభం అనుభవిస్తుందన్నారు. ఎన్నికల ముందు లక్షా 30వేల ఉద్యోగాలు ఖాళీ అని చెప్పి కేవలం 30వేల ఉద్యోగాలు మాత్రమే వేయడం సిగ్గుచేటన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ. 38,500 కోట్ల అంచనా వేసి 46వేల కోట్లు ఖర్చు చేసి, ఇంకా నిధులు కావాలని ప్రభుత్వం కోరడంపై మండి పడ్డారు. ఒక లక్షా 80వేల కోట్ల అప్పు చేసి ప్రజల్ని మోసం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
ఇది బంగారు తెలంగాణ ఎలా అవుతుందని, అప్పులు తెలంగాణ అని విమర్శించారు. ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చిన్నప్పుడే తెలంగాణ ప్రజల్ని మోసగించడం ప్రారంభమైందన్నారు. ఉద్యోగాలులేవు, నీళ్లు రావు, విద్యా, వైద్యం లేదు ఇక తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ ఓటు రాజకీయం పాల్పడుతున్నారన్నారు. భూప్రక్షాలతో రెవెన్యూ శాఖ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. రైతు బందు పథకం కాదని, ఉన్నోడికి కోసం పెట్టిన పథకం అన్నారు.
ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేకతపై పోరాటాలకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. పల్లె పల్లెకు, ప్రజల మద్యకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. సీపీఐ పెదోళ్ల కడుపు విచారింటే పార్టీ అన్నారు. ప్రజా సమస్యలపై సమరం సాగిస్తామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు కశ్వపద్మ, జిల్లా కార్యదర్శి వీఎల్ నర్సింహరెడ్డి, నాయకులు దశరత్, బాలరాజు, దుబాసిరాములు, సుదీర్, పృధ్విరాజ్, గణేష్, భూదవ్వ, రాజమ్మ, నర్సింలు, లింగం, రాజగౌడ్, రాజశేకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment