రాహుల్‌కు గుండు కొట్టించి పంపుతాం | CPI Leader Narayana Fires On Rahul Gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్‌కు గుండు కొట్టించి పంపుతాం

Published Thu, Apr 4 2019 7:37 AM | Last Updated on Thu, Apr 4 2019 9:38 AM

CPI Leader Narayana Fires On Rahul Gandhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయ అజ్ఞానంతోనే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వయనాడ్‌ నుంచి పోటీకి దిగుతున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ధ్వజమెత్తారు. అమేథీలో గెలుపుపై నమ్మకం లేక అభద్రతాభావంతో ఆయన కేరళకు మకాం మార్చారని విమర్శించారు. బుధవారం నారాయణ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా సెక్యులర్‌ శక్తులను ఏకం చేయాల్సింది పోయి కాంగ్రెస్‌ పార్టీ మొండి వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. బలమైన సెక్యులర్‌ రాష్ట్రమైన కేరళలో రాహుల్‌ పోటీ చేసి ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement