
సాక్షి, న్యూఢిల్లీ : తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠ్ అధ్యాపకుల నియామకంలో రిజర్వేషన్లు పాటించడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఈ మేరకు యూజీసీ చైర్మన్ డీపీ సింగ్‌ను కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్ల అంశమై యూజీసీ చైర్మన్ సరైన నిర్ణయం తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తక్కువ సమయంలో ఎక్కువ మంచి పనులు చేస్తున్నారని నారాయణ పేర్కొన్నారు. తద్వారా డైనమిక్ సీఎం అనిపించుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment