వైఎస్సార్‌సీపీ
సాక్షి, కడప సెవెన్‌రోడ్స్ : రాజకీయాల్లో విద్యావంతులు పెరుగుతున్నారు. ఉన్నత విద్యనభ్యసించిన వారు రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. ఈసారి జిల్లా ఎన్నికల బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులలో ఎక్కువ మంది పట్టభద్రులు కావడం విశేషం. ప్రధాన రాజకీయ పక్షా లైన వైఎస్సార్‌సీపీ..టీడీపీ అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
వైద్యం వదిలి రాజకీయ సేద్యం..
బద్వేలులో ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు అభ్యర్థులూ డాక్టర్లే. వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెంకటసుబ్బయ్య ఎంబీబీఎస్, ఎంఎస్ (ఆర్థో) చదివారు. టీడీపీ అభ్యర్థి రాజశేఖర్ ఎంబీబీఎస్ పూర్తి చేశారు. బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. జమ్మలమడుగులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నిలబడిన డాక్టర్ సుధీర్‌రెడ్డి ఎంబీబీఎస్, డీఏ (అనస్థిషియా) చదివారు.
ఇంజినీరింగ్..
ఇక రాయచోటి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి నిలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఇంజినీరింగ్ పట్టభద్రులు. అదే నియోజకవర్గంలో ఆయనతో తలపడుతున్న టీడీపీ అభ్యర్థి
అ‘లా’ బరిలో..
న్యాయశాస్త్ర పట్టభద్రులూ ఈసారిలో ఎన్నికల బరిలో తలపడుతున్నారు. రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరపున మరోమారు తలపడుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు న్యాయశాస్త్ర పట్టభద్రులు. ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ పక్షాన నామినేషను వేసిన ఎం.లింగారెడ్డి కూడా న్యాయశాస్త్ర పట్టభద్రులు. చాలాకాలం న్యాయవాదిగా పనిచేశారు. రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్న బత్యాల చెంగల్రాయులు న్యాయ విద్యను అభ్యసించారు. కడప లోక్‌సభకు సీపీఐ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థి జి. ఈశ్వరయ్య బీఎల్ చదివారు.
ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి కూడా ఇంజినీరింగ్ పట్టభద్రుడే కావడం విశేషం. జమ్మలమడుగు నుంచి బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి పి.రామసుబ్బారెడ్డి, రైల్వేకోడూరు టీడీపీ అభ్యర్థి నరసింహప్రసాద్ ఇంజినీరింగ్ చదివారు.
ఎంబీఏ..
పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో మరోమారు పోటీచేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంబీఏ చదివారు. కడప లోక్‌సభ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరపున మళ్లీ పోటీచేస్తున్న వైఎస్ అవినాష్‌రెడ్డి ఎంబీఏ చదివారు. రాజంపేట లోక్‌సభ స్థానానికి వైఎస్సార్‌సీపీ నుంచి మళ్లీ బరిలోకి దిగిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చదివింది కూడాఎంబీఏనే.కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్‌బీ అంజద్‌బాషా, టీడీపీ అభ్యర్థి అమీర్‌బాబులు ఇద్దరూ బ్యాచులర్‌ఆఫ్ ఆర్ట్స్ పట్టభద్రులు. రాజంపేట లోక్‌సభ స్థానానికి టీడీపీ పక్షాన పోటీచేస్తున్న డీకే సత్యప్రభ, కమలాపురంలో టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి పీయూసీ చదివారు. మిగిలిన వారంతా పీజీలు.. డిగ్రీ అర్హత ఉన్నవారే.
Comments
Please login to add a commentAdd a comment