ఢిల్లీలో మమతా, చంద్రబాబులకు షాక్‌ | Delhi L-G  Denies Mamata Banerjee, Chandrababu Naidu Permission To Meet Kejriwal | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మమతా, చంద్రబాబులకు షాక్‌

Published Sat, Jun 16 2018 8:37 PM | Last Updated on Sat, Jun 16 2018 8:40 PM

Delhi L-G  Denies Mamata Banerjee, Chandrababu Naidu Permission To Meet Kejriwal - Sakshi

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఢిల్లీలో షాక్‌ తగిలింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో గత ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కలవాలని నిర్ణయించుకున్న మమతా బెనర్జీకి, చంద్రబాబునాయుడికి ఎల్‌జీ షాకిచ్చారు. ఎల్‌జీ కార్యాలయంలో కేజ్రీవాల్‌ను కలిసేందుకు వారికి అనుమతి నిరాకరించారు. రేపు ఢిల్లీలో జరుగనున్న నీతి ఆయోగ్‌ సమావేశం కోసం మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్లారు. అయితే ఇదే క్రమంలో గత కొన్ని రోజులుగా రాష్ట్ర హక్కులను కేంద్రం కాలరాస్తుందంటూ..  ఢిల్లీలో ఐఏఎస్‌ అధికారులు ఆందోళన విరమింపజేసే విషయంలో ఎల్‌జీ అనిల్‌ బైజాల్‌ చొరవతీసుకోవడం లేదంటూ నిరసనకు దిగిన కేజ్రీవాల్‌, మంత్రులను రేపు ఉదయం 8 గంటలకు కలిసి వారికి మద్దతు తెలుపాలనుకున్నారు. కానీ వీరి వ్యూహానికి చెక్‌ పడింది.  

ఎల్‌జీ ఆదేశాలపై స్పందించిన కేజ్రీవాల్‌.. ఎల్‌జీ ఈ నిర్ణయాన్ని తాను సొంతంగా తీసుకున్నారని అనుకోవడం లేదని, పీఎంఓనే అనుమతి నిరాకరించాలని ఎల్‌జీని ఆదేశించి ఉంటుందని ట్వీట్‌ చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఐఏఎస్‌ల నిరసన మాదిరేనని పేర్కొన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీపై మరింత విమర్శలకు దిగిన కేజ్రీవాల్‌.. ప్రజాస్వామ్యంలో తాము నివసిస్తున్నామని, ఒక రాష్ట్ర సీఎంను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలువడానికి ప్రధానమంత్రి అనుమతి నిరాకరిస్తారా? అంటూ ప్రశ్నించారు. రాజ్‌ నివాస్‌ ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని, ఇది దేశ ప్రజలకు చెందిందన్నారు. మమతా బెనర్జీకి, చంద్రబాబునాయుడికి అనుమతి నిరాకరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా కూడా దీనిపై మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఢిల్లీ సీఎంను కలవడాన్ని పీఎంఓ ఎలా ఆపుతుంది. ఇది ఢిల్లీలో అప్రకటిత ఎమర్జెన్సీగా అభిర్ణించారు. ఈ వారం ప్రారంభంలోనే కేజ్రీవాల్‌కు మద్దతు తెలిపిన మమతా బెనర్జీ, వెంటనే కేంద్రం సమస్యను పరిష్కరించాలని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement