
స్టేషన్ మహబూబ్‌నగర్: వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని, మంత్రి కేటీఆర్ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డీకే అరుణ సవాల్ విసిరారు. ఆదివారం మహబూబ్‌నగర్ డీసీసీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో జిల్లాకు చేసిందేమీ లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జిల్లాలో నాలుగు సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభమై 90 శాతం పనులను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం శిలాఫలాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు డీకే అరుణ హారతి ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారని, ఆ ప్రాజెక్టు కడుతున్న సమయంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా, హరీశ్‌రావు రాష్ట్ర మంత్రిగా ఉన్నారన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు.
Comments
Please login to add a commentAdd a comment