భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగినా ఉత్కంఠ పోరులో కాంగ్రెస్‌దే పైచేయి సాధించింది. 230 స్ధానాలున్న మధ్యప్రదేశ్‌లో మేజిక్ ఫిగర్ 116 స్ధానాలు కాగా కాంగ్రెస్ 115 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 105 స్ధానాల్లో ముందంజలో ఉంది. బీఎస్పీ రెండు స్ధానాల్లో, ఇతరులు ఏడు స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ అవకాశాలను దెబ్బతీయగా, కాంగ్రెస్‌కు ఇదే కలిసివచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక పవనాలతో శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్‌లోని దాదాపు డజను మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు.
మంత్రి నరోత్తం మిశ్రా దాటియా స్ధానంలో 6200 ఓట్లతో ఎదురీదుతుండగా, మొరెనా నియోజకవర్గంలో మంత్రి రుస్తం సింగ్ మూడో స్ధానంలో ఉన్నారు. ఇక ఖర్గోవ్‌లో బాలక్రిష్ణ పటిదార్, గొహద్‌లో లాల్ సింగ్ ఆర్యా, షహ్‌పురా స్ధానం నుంచి ఓం ప్రకాష్ దుర్వే వెనుకంజలో ఉన్నారు. ఇక అంతర్ సింగ్ ఆర్య సెంద్వా స్ధానంలో వెనుకబడగా, హట్‌పిప్లియా నుంచి దీపక్ జోషి, సిల్వాని నుంచి రాంపాల్ సింగ్, బుర్హాన్‌పురాలో అర్చనా చిట్నిస్ ఓటమి అంచుల్లో ఉన్నారు. ఇక ఆర్థిక మంత్రి జయంత్ మాలవీయ దామో స్ధానంలో, శరద్ జైన్ జబల్‌పూర్ నార్త్ స్ధానంలో వెనుకంజలో ఉన్నారు. మరో మంత్రి జల్బన్ సింగ్ గ్వాలియర్‌లో, మాజీ ప్రదాని వాజ్‌పేయి మేనల్లుడు అనూప్ మిశ్రా బితర్వార్ స్ధానంలో వెనుకంజలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment