సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ముందస్తు ఎన్నికల షెడ్యూల్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. నాలుగు రాష్ట్రాలకు జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను శనివారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్‌తో పాటు రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఈ ఏడాది చివరిలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఓటర్ల జాబితా అంశం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఉన్న నేపథ్యంలో తెలంగాణ షెడ్యూల్ తర్వాత ప్రకటించాలని ఈసీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ రోజు సాయంత్రం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రావత్ విదేశి పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని భావిస్తున్నారు. నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని భావించినప్పటికీ ఓటర్ల జాబితా అంశం కోర్టు పరిదిలో ఉండటంతో సోమవారం తర్వాత ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment