
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘సామాజిక తెలంగాణ–సమగ్రాభివృద్ధి’ నినాదంతో సీపీఐ నిర్వహించిన పోరుబాట ముగింపు బహిరంగసభ ఆదివారం కరీంనగర్ సర్కస్ గ్రౌండ్‌లో జరుగనుంది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు అధికా రంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదంటూ, ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నాయంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నాయకత్వంలో 11 మంది బృందంతో అక్టోబర్ 6న జనగామ జిల్లా కేంద్రంలో పోరుబాట యాత్రను ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలు , దాదాపు అన్ని మం డలాలు, వేల గ్రామాలు, పట్టణాల్లో యాత్ర కొనసాగిస్తూ 60 రోజులపాటు 7,500 కి.మీ పూర్తి చేసుకొని ఆదివారం కరీంనగర్‌కు చేరుకోనుంది. సభలో సీపీఐ జాతీయ కార్య దర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, కె.నారాయణ, టీపీసీసీ అధ్యక్షులు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, టీడీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ ద్రం, టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రాం, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రజాగాయకుడు గద్దర్, విమలక్క తదితరులు పాల్గొంటారని సీపీఐ నేతలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment