విషప్రచారం బారిన పడొద్దు: ఈటల | etela rajender fires on social media campaign against trs | Sakshi
Sakshi News home page

విషప్రచారం బారిన పడొద్దు: ఈటల

Published Thu, Nov 15 2018 4:02 AM | Last Updated on Mon, Mar 25 2019 3:09 PM

etela rajender fires on social media campaign against trs - Sakshi

ఈటల రాజేందర్‌

సాక్షి, పెద్దపల్లి: శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆంధ్రా మీడియా, సోషల్‌ మీడియా చేస్తున్న విషప్రచారం బారిన పడొద్దని మంత్రి ఈటల రాజేందర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి బుధవారం నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఈటల మాట్లాడారు. ప్రస్తుతం సోషల్‌ మీడియా, ఆంధ్రా మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, కొందరు సైకోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దొంగ కెమెరాలు పెట్టుకొని ఎప్పుడో, ఎక్కడో జరిగిన సంఘటనల వీడియోలను మార్ఫింగ్‌ చేసి ఇప్పుడు పోస్ట్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విషప్రచార బారిన ప్రజలు పడొద్దని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, టీడీపీలతోనే గతంలో రాష్ట్రంలో ఆత్మహత్యలు జరిగాయని చెప్పారు. ఆ పార్టీల పుణ్యమా అని ప్రజలు ప్రశాంతత లేకుండా గడిపారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement