
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఎన్నికల సంఘం తక్షణమే కేసు పెట్టాలని, క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా వేయాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కోరారు. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంపై చంద్రబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నియమించిన అధికారిని కోవర్ట్ అంటారా అని ప్రశ్నించారు. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంపై బాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
అధికారులంతా చెప్పుచేతల్లో ఉండాలన్నది చంద్రబాబు భావనలా ఉందన్నారు. రాజ్యాంగం ఈసీకి ఇచ్చిన హక్కును చంద్రబాబు ఎలా తప్పుబడతారంటూ మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment