సాక్షి, అమరావతి: తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఏపీకి చెందిన ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రభుత్వ కార్యాలయ్యాలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోనే ఓటు హక్కు ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వీరిలో చాలామంది తెలంగాణలో ఉద్యోగం నిర్వహించారు. రాష్ట్ర విభజనలో భాగంగా వీరు ఏపీకి కేటాయించబడినా.. ఇప్పటికీ వీరి ఓటు హక్కు తెలంగాణలోనే ఉంది.
దీంతో తమ ఓటుహక్కును వినియోగించుకోవడానికి డిసెంబర్ 7న సెలవు కావాలంటూ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదే విధంగా అన్నిఆఫీసులకు వచ్చే నెల 7ను అధికారిక సెలవుగా పరిగణించాలని సీఎస్‌కు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికీ ఏపీలో పని చేస్తున్న సుమారు నాలుగు వేల మంది ఉద్యోగులకు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓటు హక్కు ఉందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment