సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే అతిచిన్న వయసులో డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్ నేత, ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్ రావు రికార్డు సృష్టించారు. గత 14 ఏళ్లలో సిద్దిపేట స్థానం నుంచి వరుసగా ఆరుసార్లు గెలుపొందారు. అంతేకాకుండా అత్యథిక మెజార్టీ సాధించిన నేతగా గుర్తింపు పొందారు. గత ఎన్నికల్లో 93,328 ఓట్ల రికార్డు స్థాయి మెజార్టీ సాధించిన హరీష్ రావు.. తాజా ఫలితాల్లో ఆ రికార్డును బ్రేక్ చేశారు. సుమారు లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించారు. హరీష్ రావు దాటికి ప్రజాకూటమి తరఫున బరిలోకి దిగిన భవాని రెడ్డికి డిపాజిట్ గల్లంతైంది.
Comments
Please login to add a commentAdd a comment