సాక్షి, సిద్దిపేట : ప్రజాస్వామ్యంలో ఓటు చాలా గొప్పదని కష్టమైనా.. ఇష్టమైన ఎమ్మెల్యేకు ఓటు వేయండని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. శ్రీనివాస్ నగర్ కాలనీలో ప్రచారంలో పాల్గొన్న హరీష్ మాట్లాడుతూ.. దేశంలో ఎప్పుడు అవార్డు వచ్చినా.. అందులో సిద్దిపేట ఉందని గుర్తుచేశారు. తాను నాలుగున్నరేండ్లు పనిచేశానని.. ఎన్ని మార్కులు వేస్తారో వేయండని ప్రజలను కోరారు. సిద్దిపేటకు కేంద్రీయ విద్యాలయాన్ని తెచ్చుకున్నామని అన్నారు. మూడు వందల కోట్లతో సిద్దిపేటలో అండర్ డ్రైనేజీ నిర్మించుకున్నామన్నారు. ఎంతో మంది ఓట్ల కోసం వస్తున్నారని, మీ వ్యక్తి ఎవరో చూసి ఓటు వేయండని విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ చొరవతో ఇక్కడి ప్రజల ఆశిస్సులతో తాను ఈ స్థాయికి వచ్చానన్నారు. సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ది చేశానని తెలిపారు. ఇప్పటివరకు 200రకాల పనులు చేశానన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రజకుల కోసం ధోబిఘాట్ ఏర్పాటు చేశామని తెలిపారు. సిద్దిపేట ప్రజలది తనది తల్లీబిడ్డల అనుబంధమని అన్నారు. లక్ష మెజార్టీతో గెలిపిస్తే మరోసారి దేశంలో గుర్తింపు వస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment