సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎన్నికల ప్రచారంలోకి పూర్తి స్థాయిలో దిగారు. శనివారం నుంచి మంగళవారం వరకు ఆయన సుడిగాలి ప్రచారం నిర్వహించనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో 4 రోజుల్లో 20 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేయనున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు హరీశ్ ప్రచార ప్రణాళిక సిద్ధమైంది. హరీశ్ ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది సెగ్మెంట్లలో పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు పోటీ చేస్తున్న కొడంగల్, గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో మక్తల్, నాగర్‌కర్నూల్, జడ్చర్ల, పాలకుర్తి, నర్సంపేట, భువనగిరి, మానకొండూరు సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించారు. మరో 20 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు.
ఎల్లారెడ్డి నుంచి కల్వకుర్తి వరకు..
శనివారం ఎల్లారెడ్డి, డోర్నకల్, వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో హరీశ్ ప్రచారం చేయనున్నారు. ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లో గాంధారి, సదాశివనగర్‌లలో.. స్టేషన్‌ఘన్‌పూర్ సెగ్మెంట్‌లోని రఘునాథపల్లిలో ఎన్నికల ప్రచారసభలో ఆయన పాల్గొంటారు.
ఆదివారం కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. కరీంనగర్‌లో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించే సభలో హరీశ్ పాల్గొంటారు. గంగాధర (చొప్పదండి), మానకొండూరు, రాజేంద్రనగర్ సెగ్మెంట్లలో రోడ్డుషో నిర్వహిస్తారు.
సోమవారం కాసిపేట (బెల్లంపల్లి), జిన్నారం (ఆదిలాబాద్), ఖానాపూర్, మంథని, సంగారెడ్డి నియోజకవర్గాల్లో హరీశ్ ప్రచారం చేస్తారు. సంగారెడ్డిలో రోడ్ షో నిర్వహిస్తారు. ఠి మంగళవారం నకిరేకల్, దేవరకొండ, మునుగోడు, అచ్చంపేట, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో హరీశ్ ప్రచార సభల్లో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment