
కమల్ హాసన్ (ఫైల్ ఫొటో)
సాక్షి, రామంతపురం (తమిళనాడు) : ప్రముఖ నటుడు, తమిళనాడు రాజకీయాల్లో ఆరంగేట్రం చేసి క్రియాశీలకంగా మారనున్న కమల్‌హాసన్‌కు అప్పుడే చిక్కులు మొదలయ్యాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పాఠశాలను సందర్శించడానికి వీల్లేదంటూ తమిళనాడులోని హిందూ మున్నానీ అనే హిందూ సంస్థ డిమాండ్ చేసింది.
రాజకీయాలను పాఠశాలలకు దూరం పెట్టాలని పేర్కొంది. ఈ మేరకు ఆ సంస్థ జిల్లా విభాగ అధ్యక్షుడు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. కమల్‌ను అక్కడికి రాకుండా నిలువరించాలని కలెక్టర్‌ను వారు కోరారు. కలాం జన్మించిన రామేశ్వరం నుంచే తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాలని కమల్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బుధవారం ఇక్కడ నుంచే పార్టీని ప్రకటించి పూర్తి స్థాయి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారనున్నారు. ఈ సందర్భంగా ఏపీజే కలాం చదివిన పాఠశాలను సందర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment