
హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీని వీడి వెళుతున్నట్లు వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడాన్ని కోమటరెడ్డి తప్పబట్టారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అందుకు సిద్ధంగా ఉందనే విషయాన్ని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి, నల్లగొండ నుంచి తాసు పోటీ చేస్తానన్న కోమటిరెడ్డి.. ఈరోజు సాయంత్రం గం. 5.30ని.లకు ప్రచారం ప్రారంభిస్తానన్నారు. తాము గెలవడమే కాదు.. 40 మందిని గెలిపించే సత్తా తమకుందన్నారు. కాగా, గెలవలేననే భయంతోనే సురేష్ రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లారన్నారు. త్వరలోనే టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు రావడం ఖాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment