సభలో మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వేదికపై వీహెచ్ తదితరులు
సాక్షి, గద్వాల: టీఆర్‌ఎస్ అవినీతి, అసమర్థ పాలనను అం తం చేసేందుకు ప్రజలు సిద్ధం కావాలని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ వైస్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యాన శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని, కుటుంబంలో ఇద్దరు వృద్ధులకు రూ.2 వేల చొప్పున, వికలాంగులకు రూ.3 వేల చొప్పున పింఛన్ ఇస్తామని, చదువుకున్న 10 లక్షల మంది నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల భృతి అందిస్తామని తెలిపారు.
మాజీ ఎంపీ వీ.హన్మంతరావు మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం దోపిడీదారుల కుటుంబంలా మారిందని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో కమీషన్లను దండుకున్నారని ఆరోపించారు. నయీం ఆస్తులు ఎక్కడికి పోయాయో చెప్పాలన్నారు. కాంగ్రెస్ నేతలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని టీఆర్‌ఎస్ నేతలు అంటున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు, దళితులకు భూములు, డబుల్ బెడ్‌రూంలు ఇస్తుంటే తాము అడ్డుకున్నామా... అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment