రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల నియమనిబంధనల ప్రకారం వ్యవహరించేలా కమిటీలు వేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా, గోదావరి జలాలు తెలంగాణ కింద ఉన్నాయని, మనం దయ తలిస్తేనే ఏపీకి వెళ్తాయన్న విషయాన్ని టీఆర్‌ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే దొంగకు తాళం చెవి ఇచ్చినట్లేనని పేర్కొన్నారు. ఓటేసి దొంగలకు తాళం ఇస్తారా? లేక గల్లీ నుంచి ఢిల్లీ దాకా సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే కాంగ్రెస్‌కు ఓటేస్తారా అనే విషయం ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. తెలంగాణ ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గబ్బర్ సింగ్ లాంటివాడని విమర్శించారు. టీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న పలు చానళ్లపై నిఘా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రేవంత్ కోరారు. (ఆ సన్నాసులు పోతే నష్టమేం లేదు: రేవంత్ రెడ్డి)
మా పొత్తులతో టీఆర్‌ఎస్‌కు భయం: కోమటి రెడ్డి
అనంతరం మరో కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. రైతులను చంపిన టీడీపీతో 2009లో టీఆర్‌ఎస్ పార్టీ ఎందుకు పెట్టుకుందని ప్రశ్నించారు. అప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుపెట్టుకున్నందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పొత్తులలో టీఆర్‌ఎస్ ఎందుకు జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. విపక్ష పార్టీల పొత్తులతో ఓడిపోతామనే భయం టీఆర్‌ఎస్ పార్టీకి పట్టుకుందని అభిప్రాయపడ్డారు. (‘ఆ రెండు నియోజకవర్గాల్లో ఓటర్లు తగ్గారు’)
Comments
Please login to add a commentAdd a comment