
తిరుపతి: నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడూ అభిమానిస్తానని, నా సహాయం కోరి శత్రువు వచ్చినా సహాయం చేస్తానని వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. స్థానిక అనంతవీధిలో కాపు, బలిజ వర్గానికి చెందిన సుమారు 500 మంది భూమన సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి భూమన సాదరంగా ఆహ్వానించారు. అనంతరం విలేకరులతో భూమన మాట్లాడుతూ.. తనకు కులం, మతం లేదని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు పరిష్కారం మాత్రమే చేస్తానని అన్నారు.
అనంతాళ్వర్ కారణంగా ఈ వీధికి అనంత వీధి అని పేరు వచ్చిందని, మీ విలువైన ఓటును నాకు వేసి గెలిపించాలని కోరారు. మీకు సేవకుడి ఉంటానని హామీ ఇచ్చారు. తాను కులానికి వ్యతిరేకమని, మనుషులకు మంచికి మాత్రమే అనుకూలమన్నారు. తన తర్వాత తన కుమారుడు భూమన అభినయ రెడ్డి రాజకీయాల్లోకి రాడని వెల్లడించారు.