
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని ఏపీ భవన్‌ను చూస్తే అది టీడీపీ భవనా? అనే సందేహం కలుగుతోంది. సరిగ్గా ఎన్నికల ముందు ధర్మపోరాట దీక్షల పేరిట కొత్త డ్రామాకు తెరలేపిన సీఎం చంద్రబాబు నాయుడు.. నేడు ఏపీ భవన్‌లో ఆ దీక్ష చేయనున్నాడు. ఈ సందర్భంగా తెలుగుతమ్ముళ్లు.. అత్యుత్సాహంతో ఏపీ భవన్‌ను ఏకంగా టీడీపీ భవన్‌గా మార్చేశారు. భారీ ఎత్తున పార్టీ ప్రచార పోస్టర్లు.. ప్లెక్సీలతో అంతా పసుపుమయం చేశారు.
అంతేకాకుండా చంద్రబాబు ఆర్మీ పేరిట ఉన్న టీషర్ట్‌లతో ఏపీ భవన్ ప్రాంగణంలో హల్‌చల్ చేస్తున్నారు. దీంతో అక్కడికి వచ్చిన ఏపీ, తెలంగాణ ఉమ్మడి భవన్ సందర్శకులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఇదేదో టీడీపీ సొత్తయినట్లు ఇలా చేస్తున్నారేంటని, పార్టీ ప్రచారానికి ప్రభుత్వ సొమ్మును వాడుకోవడం ఏంటని విసుక్కుంటున్నారు. మరోవైపు ఏపీ భవన్ అధికార యంత్రాంగం మాత్రం ఇవేవి పట్టించుకోకుండా టీడీపీ కార్యకర్తల సేవలో మునిగి తేలుతోంది.
Comments
Please login to add a commentAdd a comment