సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని వేర్వేరు నియోజకవర్గాలు, వేర్వేరు పారీ్టల నుంచి అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ.. వారిద్దరి నడుమ పద్నాలుగేళ్లుగా పలకరింపులు లేవు. అసెంబ్లీ మొదలుకుని.. జిల్లా పరిషత్ సమావేశాల వరకు పరస్పరం ఎదురైనా కనీసం ఒకరినొకరు కన్నెత్తి చూసుకోలేని పరిస్థితి. ఆ ఇద్దరిలో ఒకరు సిద్దిపేట నుంచి టీఆర్‌ఎస్ పక్షాన ఎన్నికైన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కాగా, మరొకరు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అయితే బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సభ జరుగుతున్న సమయంలో బయటకు వచి్చన హరీశ్‌రావు.. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తో సంభాíÙస్తున్న సమయంలో జగ్గారెడ్డి అటుగా వచ్చారు. హరీశ్, సోలిపేట సంభాషణలో జోక్యం చేసుకుంటూ.. ‘నేను ఉమ్మడి మెదక్ జిల్లాలో శాసనసభ్యుడిగా ఉన్నా. మీరు జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా కూడా ఉన్నారు. నాకు మీరంటే ఎలాంటి వ్యతిరేక భావన లేదు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించండి. మెడికల్ కాలేజీ మంజూరుకు మీ సహకారం అవసరం’ అని కోరారు. సుమారు నిమిషం పాటు జరిగిన సంభాషణలో సంగారెడ్డి అభివృద్ధికి సంబంధించిన అంశాలను జగ్గారెడ్డి ప్రస్తావించగా.. హరీశ్ అంతే సానుకూలంగా తప్ప క సహకరిస్తానన్నారు. 2004 నుంచి ఇద్దరు నేతల నడుమ కనీస పలకరింపులు కూడా లేవు.
కాంగ్రెస్‌లో సింగిల్ హీరో ఉండడు
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం సహజమేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో సింగిల్ హీరో ఉండడని, అందరికీ రాహుల్‌గాం«దీనే హీరో, ఆయ న కిందే అందరూ పనిచేయాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment