
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఏ ఫ్రంట్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ లేదా బీజేపీలలో ఏదో ఒక పార్టీ మద్దతు లేకుండా ప్రధాని అయిన సందర్భం లేదని, అందరికంటే తెలివి కొంచెం ఎక్కువ ఉన్న కేసీఆర్‌కు ఆ విషయం తెలియదా అని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ సాధ్యమయ్యే ప్రసక్తే లేదని అన్నారు. నాలుగేళ్లు ప్రధాని మోదీకి బానిసగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు కుట్రపూరితంగా ఆయనకు వ్యతిరేకంగా కనిపిస్తున్నారని, ఎన్నికల తర్వాత మళ్లీ బీజేపీ పంచనే చేరుతాడని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment