
సాక్షి, అమరావతి: టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయ బోయే థర్డ్ ఫ్రంట్‌కు జనసేన పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. పవన్ ప్రసంగ వీడియోను ఆదివారం ఆ పార్టీ కార్యా లయం మీడియాకు విడుదల చేసింది. ‘దేశ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం ఉండాలి.
రాష్ట్రాల్లో చోటుచేసుకునే సున్నిత సమస్యలను అర్థం చేసుకునే కొందరు వ్యక్తుల సమూహం దేశ రాజకీయాల్లో అవసరం. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలి. కొత్త ఆలోచన రావాలి. కొత్త రక్తంతో కూడిన థర్డ్ ఫ్రంట్ కావాలి. దీనికి అంకురార్పణ చేద్దామనుకున్న కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను’ అని పవన్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో మద్దతుగా మాట్లాడారని.. టీడీపీ, వైఎస్సా ర్ సీపీ పార్లమెంట్‌లో హోదా కోసం చేసే పోరాటంలో టీఆర్‌ఎస్ సహాయం కూడా తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment