
సాక్షి, అనంతపురం: జిల్లాలోని యాడికి మండలంలోని కోనుప్పలపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట శివారెడ్డి ఇంటిపై, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుంది. జేసీ వర్గీయుల దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి. వాల్టా చట్టానికి విరుద్ధంగా జేసీ ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డి బోరు వేస్తున్నారని.. వైఎస్సార్ సీపీ నేతలు అధికారులకు ఫిర్యాదు చేశారు. తమపై అధికారులకు ఫిర్యాదు చేశారన్న అక్కసుతో జేసీ వర్గీయులు వైఎస్సార్ సీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు.
అయితే వైఎస్సార్ సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో పోలీసుల ఏకపక్ష వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ నేత పెద్దారెడ్డి యాడికి పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. వైఎస్సార్ సీపీ నేతలపై దాడికి పాల్పడ్డ జేసీ వర్గీయులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment