సాక్షి, అనంతపురం: అధికార టీడీపీలో మరోసారి గ్రూపు రాజకీయాలు తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీ ప్రయోజనాలు పట్టించుకోకుండా స్వలాభాల కోసం కొందరు నాయకులు పనిచేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు పలు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో గ్రూపు రాజకీయాలు, కుటుంబపాలనను ప్రోత్సహిస్తున్న నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
పార్టీకి చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులకు పెత్తనం కట్టబెట్టడంపై అభ్యంతరం తెలుపుతూ.. పరోక్షంగా మంత్రి పరిటాల సునీతకు చురకలు అంటించారు. సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తానని, పార్టీకు అనుగుణంగా నాయకులు నడుచుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. అందరూ కలసికట్టుగా పనిచేయాలని లేకుంటే సీనియర్లనైనా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై జేసీ దివాకర్ రెడ్డి సెటైర్ వేశారు. తమకు చెప్పిన సూత్రాలు, సూచనలను చంద్రబాబు ఫాలో అవుతారా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment