సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం మద్యం వ్యాపారంతో జనాల్ని బలి తీసుకుంటోందని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నడిపేందుకు పూర్తిగా మద్యం ఆదాయంపైనే ఆధారపడుతున్నట్టు కనిపిస్తోందని పేర్కొంటూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
అధికారంలోకి రాకముందు మద్యం మహమ్మారిపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని దుయ్యబట్టారు. ఇది బంగారు తెలంగాణా.. మద్యం తెలంగాణా అని ప్రశ్నించారు. బార్లు, పబ్బుల పనివేళలను పొడిగించడం, వైన్సులకు సిట్టింగు రూములను పెంచడం వంటివి చూస్తుంటే ప్రభుత్వం మద్యం ఆదాయంపై ఎంతగా ఆధారపడిందో తెలుస్తోందని విమర్శించారు.