అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుపై కేఏ పాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో జనసేన కలవడాన్ని తప్పుపట్టారు. బీజేపీ- జనసేన పొత్తు విషయంపై స్పందించిన ఆయన... పవన్ పవర్ కోసమే పార్టీ పెట్టారని ఆరోపించారు. జనసేన పార్టీకి ఐదు నుంచి ఆరు శాతం కంటే ఎక్కువ ఓటింగ్ శాతం రాదని తాను గతంలోనే చెప్పానన్నారు. పవన్ కల్యాణ్ పోటీ చేసిన ఒక్క సీటును కూడా గెలవరని తాను ముందే చెప్పానని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
చదవండి: ‘జనసేన అధ్యాయం ముగిసినట్టే..’
శుక్రవారం ఉదయం తన ఫేస్‌బుక్ పేజీ లైవ్‌లో మాట్లాడిన కేఏ పాల్.. జనసేన చీఫ్‌పై సానుభూతి వ్యక్తం చేశారు. పవన్‌ను చూస్తే విచారంగా ఉందని, 2008లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడే అతడు కాంగ్రెస్ ఏజెంట్ అని తాను చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ‘పవన్ నీకు అంత పవర్ ఉంటే, మోదీతో అంత రిలేషన్ ఉంటే ప్రత్యేక హోదా తెచ్చి చూపించాలి. కాపులు, దళితులు, గిరిజనులు, రైతులను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు. నేనంటే ఎన్నికలకు మూడు వారాల ముందు వచ్చా. నువ్వు 8 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నావు. కానీ ఒక్క సీటు మాత్రమే వచ్చింది.
చదవండి: చస్తే చస్తాం గానీ.. బీజేపీలో విలీనం చేయబోం
నిన్నటి వరకు చంద్రబాబు నాయుడుతో ఉండి.. ఆయన పలుకులు పలికి ఇప్పుడు మళ్లీ బీజేపీతో పొత్తు ఏంటి’ అని సూటిగా ప్రశ్నించారు. ప్రజలు అందుకే జనసేనను ఎన్నికల్లో నమ్మలేదని.. మెడ వంచకూడదు.. అడుక్కోకూడదు.. నరేంద్ర మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకుంటే రాష్ట్రానికి వచ్చేది ఏమీ లేదని అన్నారు. 2024లో ఎన్నికలు ఉంటే.. ఇప్పుడే పొత్తు ఎందుకో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై నిందలు వేస్తున్నావు.. ఆయన ప్రస్తుతం మన ముఖ్యమంత్రి. నువ్వు బాధ్యత గల ప్రతిపక్షంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయనకు సపోర్ట్ చేయాలిగా’ అని హితవు పలికారు.
చదవండి: ఆయనకు ‘మూడు’ బాగా కలిసొచ్చింది..!
ముఖ్యమంత్రిని వ్యతిరేకించి.. ప్రత్యేక హోదా తెస్తే అప్పుడు జనాలు పవన్ కల్యాణ్‌ను మెచ్చుకుంటారు, అంతేగానీ డాన్స్‌లు, డ్రామాలు వేస్తే ఏపీకి పెట్టుబడులు రావంటూ పవన్‌పై కేఏ పాల్ సెటైర్లు వేశారు. ప్రజలు మూర్ఖులు కాదని అందుకే పవన్‌ను నమ్మలేదని ధ్వజమెత్తారు. బీజేపీతో జనసేన పొత్తుపెట్టుకోవడంతో పవన్ అసలు స్వరూపం బయటపడిందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment