
బీజేపీలో చేరిన నేతలతో లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్ నాయకులు బుధవారం బీజేపీలో చేరారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వ పోకడలను ప్రజలకు వివరిస్తామని, బీజేపీ అత్యధిక స్థానాలను సాధిస్తుం దని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ వైఫల్యాలను వివరిస్తే ప్రజలే వారికి ఓటు రూపంలో బుద్ధి చెబుతారన్నారు. ప్రధాని మోదీ ఇమేజ్ దెబ్బతీయడానికి కాంగ్రెస్ అనేక విధాలుగా ప్రయత్నిస్తోందని, ఆ పార్టీ చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మరని అన్నారు.
కృష్ణయ్య వస్తే ఎంపీ సీటు ఇస్తాం
టీడీపీ మాజీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య బీజేపీలోకి వస్తానంటే ఎంపీ టికెట్ ఇవ్వడానికైనా తాము సిద్ధమేనని లక్ష్మణ్ తెలిపారు. అక్టోబర్ తొలి వారంలో 30 మంది అభ్యర్థులతో మొదటి జాబితా ప్రకటిస్తామన్నారు. అదే నెలలో అమిత్ షాతో కరీంనగర్, వరంగల్‌లలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. టీజేఎస్, తెలం గాణ ఇంటిపార్టీల నేతలు బీజేపీలో చేరేందుకు ఊగి సలాడుతున్నారని, ఇంటి పార్టీ నేత యెన్నం శ్రీనివాస్‌తో సహా పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామన్నారు. ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీ గా యువ సమ్మేళనాలు నిర్వహిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment