
ఆఫీసర్ల ఉచ్చులో ప్రభుత్వం పడటం వల్లే..
హైదరాబాద్:రేషన్ కార్డులు, పెన్షన్ కార్డుల అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ విధానంలో స్పష్టత లోపించిందని బీజేపీ ఎమ్మెల్యే డా.లక్ష్మణ్ విమర్శించారు. బోగస్ కార్డుల పేరుతో పెద్ద ఎత్తున కార్డులకు కోత పెట్టడమే ఎజెండాగా అధికారులు వ్యవహరిస్తున్నారని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఆఫీసర్ల ఉచ్చులో ప్రభుత్వం పడటం వల్ల పాలన గాడితప్పిందన్నారు. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన డా.లక్ష్మణ్.. ప్రజా సమస్యలపై టీడీపీతో సంబంధం లేకుండా బీజేపీ విడిగానే పోరాడుతుందన్నారు. టీడీపీతో పొత్తు అనేది ఎన్నికల వరకే అని లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఆందోళన చెందడానికేనా?అని ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు.
పేదల సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రయోగాలు చేయడం సరికాదన్నారు. ఆ అధికారులు ఇప్పుడు కేసీఆర్ సర్కార్ కు సలహాలు ఇస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని కుంభకోణాలే అంటున్న సర్కార్ అప్పటి అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు.