రాష్ట్రంలో విపక్ష నేతలకు, సొంత పార్టీ నేతలకు సీఎం ఎన్నిసార్లు అపాయింట్‌మెంట్ ఇచ్చారు..
ప్రధాని అపాయింట్‌మెంట్ రద్దుపై టీఆర్‌ఎస్‌వి అసత్య ఆరోపణలు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విపక్ష నేతలకు, సొంత పార్టీ నేతలకు సీఎం ఎన్నిసార్లు అపాయింట్‌మెంట్ ఇచ్చారు.. వాటిని ఎన్నిసార్లు రద్దు చేశారో టీఆర్‌ఎస్ నేతలు ప్రజలకు చెబితే బావుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రధానిని కలుసుకునే విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై టీఆర్‌ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
పార్టీలుగా టీఆర్‌ఎస్, బీజేపీలు వేరైనా ప్రభుత్వాల మధ్య జరిగే కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవడం కాని, అపాయింట్‌మెంట్లు రద్దు చేయించే సంస్కృతి కాని బీజేపీది కాదన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వారు బాధ్యతారహితంగా మాట్లాడటం సబబు కాదన్నారు.