సాక్షి, చెన్నై: శభాష్ మిత్రమా.. అలా రండి.. మీ దారి ప్రత్యేకం కాదు.. రహదారి..! ఇలా అన్నది ఎవరో కాదు కమలహాసన్. చెప్పింది తన చిరకాల మిత్రుడు, నటుడు రజనీకాంత్ గురించి. కమల్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. అసలేం జరిగిందంటే నటుడు రజనీకాంత్ త్వరలో రాజయ పార్టీని ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈయన ఆరంభం నుంచి అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారతీ జనతా పార్టీకి అనుకూలంగానూ ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్రమోదీకి మద్దతుదారుడనే ముద్ర పడింది. ఆ మధ్య తూత్తుక్కుడిలో జరిగిన కాల్పల సంఘటనలో దేశ ద్రోహులు చోరబడ్డారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని ప్రశంసిస్తూ బలవంతుడిగా పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లుకు మద్దతు పలికారు. ఇలాంటి కారణాలతోనే రజనీకాంత్ బీజేపీ మద్దతుదారుడనే ముద్ర వేసుకున్నారు. కాగా తాజాగా ఢిలీలో జరిగిన అల్లర్లపై స్పందిస్తూ ఇది కేంద్ర ప్రభుత్వం విఫలం అయ్యిందనడానికి నిదర్శనం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: 24 గంటల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు మృతి
కేంద్ర ప్రభుత్వ చర్యల్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దీన్ని కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఊహించనిదే. బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పిన రజనీకాంత్‌ను తమ వైపు తిప్పుకోవడానికి కొన్ని పార్టీలు ప్రయత్నాలు మొదలెట్టేశాయి. ముఖ్యంగా కమలహాసన్ మక్కళ్ నీది మయ్మం పార్టీ. రజనీకాంత్ వ్యాఖ్యలపై స్పందించిన కమలహాసన్ శహభాష్ మిత్రమా రజనీకాంత్. అలా రండి. ఈ దారి రహదారి. ప్రత్యేక దారి కాదు. ఇకపై రాజబాటే. రండి. శుభాకాంక్షలు.. అని తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. చదవండి: నటుడు ప్రకాశ్‌రాజ్‌కు హైకోర్టు నోటీసులు
కమల్ రాబోయో శాసనసభ ఎన్నికల్లో రజనీకాంత్‌తో కలిసి పయనించటాన్ని భావిస్తున్నట్లు తేట తెల్లమవుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో నటుడు రజనీకాంత్‌నే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అవసరం అయితే కలిసి పనిచేస్తామని రజనీకాంత్ చాలా రోజుల క్రితమే ఇంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ హీరోగా నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు ఒక భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment