
సాక్షి, మంగళగిరి: మంగళగిరి టికెట్‌ను అధిష్టానం తనకు ప్రకటించిందంటూ నియోజకవర్గానికి వచ్చిన నారా లోకేశ్‌కు చుక్కెదురైనట్లు సమాచారం. గురువారం రాత్రి పట్టణానికి వచ్చిన లోకేశ్‌ను మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల నిలదీసినట్లు సమాచారం.
‘మా వియ్యంకుడు మురుగుడు హనుమంతరావుకు టికెట్ ఇస్తామని పార్టీలో చేర్చుకున్నారు. నాకు కానీ.. నా కుటుంబానికి కానీ టికెట్ ఇస్తామన్న మీ తండ్రి హామీతోనే పార్టీలో చేరాము. ఇప్పుడు మమ్మల్ని మోసం చేసి మీరు నేరుగా పోటీ చేస్తే మా పరిస్థితి ఏమిటంటూ’ కమల నిలదీసినట్లు సమాచారం. దీంతో కంగుతిన్న లోకేష్.. మీ అందరి భవిష్యత్తు చంద్రబాబు చూసుకుంటారని అనడంతో ‘అధికారంలో ఉన్నప్పుడే పద్మశాలీలకు ఏమి చేయలేకపోయారని.. అధికారంలో లేకపోతే ఏమి చేస్తారని’ ప్రశ్నించినట్లు తెలిసింది. (చదవండి: 1980 నుంచి టీడీపీ గెలవలేదు!)
Comments
Please login to add a commentAdd a comment