LIVE: Karnataka Election Results in Telugu | కర్ణాటక 2018 ఎన్నికల ఫలితాలు - Sakshi
Sakshi News home page

Published Tue, May 15 2018 8:06 AM | Last Updated on Wed, Sep 5 2018 3:24 PM

Karnataka Assembly elections Live Updates - Sakshi

సాక్షి, బెంగళూరు: యావత్‌ భారత దేశం ఉత్కంఠతో ఎదురు చూసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే బీజేపీ 104, కాంగ్రెస్‌ 78, జేడీఎస్‌ 37, బీఎస్‌పీ-1, ఇతరులు-2 సీట్లు సాధించారు. మరోవైపు హంగ్‌ నేపథ్యంలో రాజ్‌భవన్‌ వద్ద రసవత్తరమైన రాజకీయాలు కొనసాగాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఛాన్స్‌ ఇవ్వాలంటూ బీజేపీ సీఎం అభ్యర్థి యెడ్యూరప్ప, ఆ వెంటనే కాంగ్రెస్‌ మద్ధతుతో జేడీఎస్‌లు గవర్నర్‌ను కలిశాయి. అయితే ఏ విషయం అన్నదానిపై ఇరు వర్గాలకు గవర్నర్‌ స్పష్టత ఇవ్వన్నట్లు తెలుస్తోంది. ఇది ఖచ్ఛితంగా జేడీఎస్‌ ప్రభుత్వమేనని మాజీ సీఎం సిద్ధరామయ్య, 100 శాతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని యెడ్యూరప్ప మీడియాకు వెల్లడించారు. ఎవరికి వారే ప్రభుత్వ ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. జేడీఎస్‌ వర్గపోరును తనకు అనుకూలంగా మార్చుకుని బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తుండగా, తమకు అధికారం దక్కకపోయినా ఫర్వాలేదుగానీ.. బీజేపీని అధికారానికి దూరం చేయాలని కాంగ్రెస్‌ తీవ్రంగా యత్ని‍స్తోంది.  ఎన్నికల ఫలితాలు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. బీజేపీ ఆధిక్యంలో, కాంగ్రెస్‌ రెండో స్థానంలో జేడీఎస్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.

  • బీజేపీ 104, కాంగ్రెస్‌ 78, జేడీఎస్‌ 37, బీఎస్‌పీ-1, ఇతరులు-2 
  • ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం వద్ద సందడి 
  • కాంగ్రెస్‌ మాకు మద్ధతు ఇస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరాం: కుమారస్వామి
  • ప్రభుత్వ ఏర్పాటు విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే మా వద్ద సభ్యులు ఎక్కువగా ఉన్నారు. ఇండిపెండెంట్‌గా గెలిచిన వారు కూడా మాకే మద్ధతు ఇస్తున్నారు: కర్ణాటక పీసీసీ చీఫ్‌ పరమేశ్వర
  • ఇది ముమ్మాటికీ జేడీఎస్‌ ప్రభుత్వం: సిద్ధరామయ్య
  • గవర్నర్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరాం. ఏ విషయం అన్నది త్వరలో తెలియజేస్తామని ఆయన చెప్పారు.: యెడ్డీ
  • అనూహ్య పరిణామం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన యెడ్యూరప్ప
  • ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు యెడ్జీ విజ్ఞప్తి
  • అనంతరం రాజ్‌ భవన్‌కు యెడ్యూరప్ప 
  • మీడియా భేటీలో మాట్లాడిన యెడ్యూరప్ప
  • ప్రజలు తిరస్కరించినా దొడ్డిదారిలో అధికారం చేపట్టాలని కాంగ్రెస్‌ యత్నిస్తోంది: యెడ్డీ
  • కర్ణాటక ప్రజలు అభివృద్ధికే ఓటేశారు.. ఇది అమిత్‌ షా, బీజేపీ సాధించిన విజయం: యెడ్డీ

  • పొత్తుపై అధికారికంగా స్పందించిన జేడీఎస్‌.  
  • పొత్తు నేపథ్యంలో కుమారస్వామిని సీఎం చేస్తామని కాంగ్రెస్‌ ఎప్పటి నుంచో చెబుతోంది: జేడీఎస్‌ నేత దానిష్‌ అలీ
  • బీజేపీకి అధికారం దక్కకుండా మేం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాం: దానిష్‌ అలీ
  • కాంగ్రెస్‌ ప్రతిపాదనలను అంగీకరించాం: దానిష్‌ అలీ

  • అమిత్‌షా ఇంట్లో కేంద్ర మంత్రుల భేటీ, కాంగ్రెస్‌-జేడీఎస్‌ పొత్తు నేపథ్యంలో బీజేపీ వ్యూహరచన
  • బెల్గావీ రూరల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మీ హెబ్బల్కర్‌ విజయం
  • దేవగౌడ నివాసానికి కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఆజాద్‌, గెహ్లట్‌, పరమేశ్వరలు
  • అమిత్‌ షా ప్రెస్‌ మీట్‌ వాయిదా?
  • ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్న యెడ్యూరప్ప
  • బయటి నుంచి మద్ధతు వద్దంటున్న జేడీఎస్‌, కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు మొగ్గు
  • మరికాసేపట్లో బీజేపీ మీడియా సమావేశం!
  • సాధారణ మెజారిటీ రాకపోవడంతో జేడీఎస్‌ మద్దతు తీసుకోకతప్పని పరిస్థితి..
  • సిద్ధరామయ్య ఇంట్లో భేటీ అయిన కాంగ్రెస్‌ నేతలు, జేడీఎస్‌తో చర్చించాల్సిన పరిస్థితులపై చర్చ
  • శరవేగంగా పరిణామాలు.. జేడీఎస్‌ మద్దతు కూడగట్టడంలో కాంగ్రెస్‌ దాదాపు సక్సెస్‌
  • జేడీఎస్‌కు మద్ధతు ఇస్తాం: కర్ణాటక పీసీసీ చీఫ్‌ పరమేశ్వర
  • పొత్తుపై ప్రకటన చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ 
  • దేవగౌడ, కుమారస్వామిలతో ఫోన్‌లో మాట్లాడాం: ఆజాద్‌
  • జేడీఎస్‌ ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తే వారికే మా మద్ధతు, బీజేపీ కంటే మా రెండు పార్టీలకే ఎక్కువ సీట్లు వచ్చాయి: ఆజాద్
  • ఓటమిని అంగీకరించిన సిద్ధరామయ్య, ప్రజాతీర్పును గౌరవిస్తామని ప్రకటన
  • ఫలితాలను నిశితంగా గమనిస్తున్న బీజేపీ అధినాయకత్వం
  • గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరిన యెడ్యూరప్ప, అమిత్‌షాతోనూ ఫోన్‌లో యెడ్డీ మంతనాలు
  • దెవగౌడ దగ్గరకు బయలుదేరిన కుమారస్వామి, కాంగ్రెస్‌ ప్రతిపాదనపై చర్చ

  • యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ జేడీఎస్‌ సుప్రీం దేవగౌడతో ఫోన్‌లో మాట్లాడారు. 
  • కుమారస్వామిని సీఎం చేసే ఒప్పందం మేర మద్ధతును కూడగట్టేయత్నం
  • కాంగ్రెస్‌ ఆఫర్‌కు జేడీఎస్‌ ఓకే? 

    అంతలోనే లీడ్‌.. ఆపై కొంత వెనక్కి..
  • అంతకుముందు లీడ్స్‌ ప్రకారం మ్యాజిక్‌ ఫిగర్‌ చేరుకున్న బీజేపీ..
  • 115కుపైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంతో దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల సంబరాలు
  • మారిన లీడ్స్‌తో బీజేపీలో ఉత్కంఠ..
  • చాముండేశ్వరి నియోజకవర్గంలో సీఎం సిద్దరామయ్య ఓటమి
  • బాదామి నియోజకవర్గంలో సీఎం సిద్దరామయ్యకు ఊరట
  • బాదామి నియోజకవర్గంలో మూడు వేలకుపైగా ఓట్ల మెజారిటీతో సిద్దరామయ్య విజయం
  • ప్రజలు లేక వెలవెలపోయిన సీఎం సిదరామయ్య ఇల్లు..
  • షికారిపురలో బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప విజయం
  •  మైసూరు మినహా మిగతా ప్రాంతాల్లో బీజేపీ హవా
  •  సాధారణ మెజార్టీ దిశగా బీజేపీ పరుగులు
  • తీర్థహళ్లిలో అరగ జ్ఞానేంద్ర (బీజేపీ) గెలుపు
  • మడబిద్రిలో ఉమనాథ విజయం
  •  కింగ్‌ మేకర్‌ గా మారిన జేడీఎస్‌
  •  ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు మించి దూసుకెళుతున్న జేడీఎస్‌
  • దక్షిణ కర్ణాటకలో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టిన జేడీఎస్‌
  •  పనిచేయని కాంగ్రెస్‌ -లింగాయత్‌ అస్త్రం
  •  ఏ పార్టీకి రాని స్పష్టమైన మెజార్టీ
  •  ప్రస్తుతానికి అతి పెద్ద పార్టీగా బీజేపీ
  •  వంద మార్క్‌ దాటిన బీజేపీ
  •  బాగా వెనుకబడుతున్న కాంగ్రెస్‌
  •  జేడీఎస్‌ మద్దతు కోసం కాంగ్రెస్‌, బీజేపీ యత్నం
     
  • రామనగరలో 7వేల ఓట్లతో కుమారస్వామి ఆధిక్యం
  • చెన్నపట్నలోనూ ముందంజ
  •  హైదరాబాద్‌ కర్ణాటక, ముంబై కర్ణాటకలో బీజేపీ ముందంజ
  • బాదామీలో సిద్ధరామయ్య ముందంజ, శ్రీరాములు వెనుకంజ
  • బళ్లారి ఎస్టీ నియోజకవర్గంలో గాలి జనార్దనరెడ్డి అనుచరుడు పకీరప్ప ముందంజ
  • మైసూరు ప్రాంతంలో జేడీఎస్‌ ముందంజ
  • కోస్టల్‌ కర్ణాటకలో బీజేపీ దూకుడు
  • దేవగౌడకు కాంగ్రెస్‌ పెద్దల ఆఫర్‌
  •  పూర్తి ఫలితాలు వచ్చాకే నిర్ణయమన్న దేవగౌడ
  • మీరు సూచించిన అభ్యర్థికే సీఎం పదవి ఇస్తామని హామీ
  • బాగేపల్లిలో నటుడు సాయికుమార్‌ వెనుకంజ
     
  • తమకే స్పష్టమైన మెజార్టీ వస్తుందంటున్న బీజేపీ
  • బెంగళూరు సిటీలో కాంగ్రెస్‌ ఆధిక్యం
  • క్షణక్షణానికి మారుతున్న ఆధిక్యాలు
  • దక్షిణ కర్ణాటకలో జేడీఎస్‌ దూకుడు
  • మల్లికార్జున ఖర్గే ఇలాకాలో బీజేపీ ఆధిక్యం
  • తుముకూరులో బీజేపీ అభ్యర్థి ముందంజ
     
  • ఫలితాల సరళి చూసి రంగంలోకి కాంగ్రెస్‌ పెద్దలు
  • దేవెగౌడతో కాంగ్రెస్‌ పెద్దల మంతనాలు
  • మొలుకాల్మూరులో శ్రీరాములు ఆధిక్యం
  • హడగలిలో కాంగ్రెస్‌ అభ్యర్థి పరమేశ్వర్‌ ముందంజ
  • సండూరులో కాంగ్రెస్‌ అభ్యర్థి తుకారాం 2వేల ఓట్లతో ముందంజ
     
  • రామనగర నియోజకవర్గంలో 1552 ఓట్లతో కుమారస్వామి ముందంజ
  • బళ్లారి సిటీలో బీజేపీ అభ్యర్థి గాలి సోమశేఖరరెడ్డి ఆధిక్యత
  • హడగళి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి పరమేశ్వర నాయక్‌ ఆధిక్యం
  •  బళ్లారి బెల్ట్‌ లో గాలి జనార్దనరెడ్డి సోదరుల హవా
  •  శికారిపురలో యడ్యూరప్ప ముందంజ
  •  శృంగేరిలో కాంగ్రెస్‌ కు ఆధిక్యం!
     
  • లింగాయత్‌ ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం
  • హరప్పనహళిలో గాలి కరుణాకరరెడ్డి ముందంజ
  • ఆధిక్యంలో హెచ్‌డీ రేవణ్ణ (జేడీఎస్‌)
  • కనకపురలో శివకుమార్‌ (కాంగ్రెస్‌) ముందంజ
  • బాదామిలో ఆధిక్యంలోకి వచ్చిన సిద్దరామయ్య
  • చాముండేశ్వరిలో 6వేల ఓట్లతో వెనుకబడిన సీఎం సిద్దూ..
  • చిత్తాపూర్‌లో కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్‌ ఖర్గే ముందంజ
  • రెండు స్థానాల్లోనూ సీఎం సిద్దరామయ్య వెనుకంజ..
  • చాముండేశ్వరిలోనూ సీఎం సిద్దరామయ్య వెనుకంజ
  • బాదామిలో సీఎం సిద్దరామయ్య వెనుకంజ..
     
  • బాదామిలో సీఎం సిద్దరామయ్యపై బీజేపీ అభ్యర్థి శ్రీరాములు ముందంజ
  • వరుణలో సీఎం తనయుడు యతీంద్ర ముందంజ
  • చిక్‌మగ్‌లూరులో సీపీ రవి (బీజేపీ) ముందంజ
  • బళ్లారిలో గాలిసోమశేఖరరెడ్డి (బీజేపీ) ముందంజ
  • రామనగరిలో కుమారస్వామి ముందంజ
  • షికారిపురలో బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప ముందంజ
  • ప్రారంభమైన కర్ణాటక ఎన్నికల కౌంటింగ్‌
  • కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నాగమంగళలోని ఆదిచుంచనగిరి మహా సంస్థాన మఠంలో జేడీఎస్‌ అధినేత కుమారస్వామి పూజలు
  • కర్ణాటక ఫలితాల నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద యజ్ఞం నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తలు
  • బెంగళూరులోని బీఎంఎస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఏర్పాటుచేసిన కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద దృశ్యాలు. ఫలితాల నేపథ్యంలో 50వేలమంది పోలీసులతో కర్ణాటక అంతటా కట్టుదిట్టమైన భద్రత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement