సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చివరి రేషన్‌కార్డుదారుడికి కూడా సరుకులు అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రెండు మూడు రోజుల్లోనే వంద శాతం పంపిణీ పూర్తి చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేషన్ డిపోల వద్ద భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరారు.
కరోనా నియంత్రణపై వలంటీర్లు సైనికుల్లా పని చేస్తున్నారని అభినందించారు. చోడవరంలో వృద్ధురాలి మృతిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లో వైరస్ కోరలు పెకిలించే మందు తమ దగ్గర ఉందని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌కు భయపడి ఇంట్లో దాక్కున్న చంద్రబాబు విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. మంగళవారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.
► వలంటీర్లతో సరుకులు ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు గతంలో వారిపై చేసిన విమర్శలు గుర్తు చేసుకోవాలి. ఇప్పటికైనా వలంటీర్ల సేవలను గుర్తించడం అభినందనీయం.
► రేషన్ సరుకులు కొలిచి ఇవ్వాల్సి ఉన్నందున కొన్నిచోట్ల క్యూలలో నిలుచుంటున్నారు.
► దేశవ్యాప్తంగా లాక్‌డౌన్, కరోనా నేపథ్యంలో రెండు నెలల పాటు పాత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించాం.
అందరికీ రేషన్ అందిస్తాం
Published Wed, Apr 1 2020 4:42 AM | Last Updated on Wed, Apr 1 2020 4:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment