
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు తమ పార్టీ అభ్యర్థులను మెజార్టీ స్థానాల్లో గెలిపించారని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజమేనని, ప్రజా తీర్పును గౌరవిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 16 సీట్లు గెలవాలని తాము ఆశించామని.. కానీ మా అంచనాలకు విరుద్ధంగా ప్రజలు తీర్పునిచ్చారని కేటీఆర్ నిరాశ వ్యక్తం చేశారు. కాగా 16 సీట్లే లక్ష్యంగా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్‌ఎస్‌కు ఊహించని ఫలితాలు ఎదురైయ్యాయి. ముఖ్యంగా నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో కేసీఆర్ కుమార్తె కవిత ఓటమి చెందడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మొత్తం 17 స్థానాల్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 4, ఎంఐఎం 1 స్థానంలో గెలుపొందగా మిగతా స్థానాలను కారు పార్టీ సొంతం చేసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment