సమావేశ సన్నాహం | Parliamentary Election Meeting In Nizamabad | Sakshi
Sakshi News home page

సమావేశ సన్నాహం

Published Thu, Mar 7 2019 6:45 AM | Last Updated on Thu, Mar 7 2019 7:15 AM

Parliamentary Election Meeting In Nizamabad - Sakshi

నిజామాబాద్‌లోని గిరిరాజ కళాశాల మైదానంలో ఈ నెల 14న జరుగనున్న టీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంటరీస్థాయి సమావేశం నేపథ్యంలో బుధవారం హైదరాబాలోని ఎంపీ కల్వకుంట్ల కవిత నివాసంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సమావేశానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరు కానున్నారు.   

చంద్రశేఖర్‌కాలనీ: నగరంలోని గిరిరాజ కళా శాల మైదానంలో ఈ నెల 14న జరుగనున్న టీఆర్‌ఎస్‌  పార్టీ పార్లమెంటరీ స్థాయి సమావేశం విజయవంతం చేసేందుకు బుధవారం హైదరాబాలోని ఎంపీ కల్వకుంట్ల కవిత నివాసంలో సన్నాహక సమావేశం నిర్వహిం చారు. ఎంపీ కల్వకుంట్ల కవిత,  మంత్రి వే ముల ప్రశాంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి నిజామాబాద్‌ అర్బన్, రూరల్‌ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, బోధన్, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు షకీల్‌ ఆమేర్, ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, కె విద్యాసాగర్‌ రావు, డాక్టర్‌ సంజయ్‌ కుమార్లతో పాటు ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, ఆకుల లలిత, భానుప్రసాదరావు హాజరయ్యారు.

సమావేశంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. స్థానిక సం స్థల ప్రజా ప్రతినిధులు, పార్టీ బాధ్యులు ప్రతి నియోజకవర్గం నుంచి మూడువేలకు పైగా సమావేశానికి హాజరవుతుండగా.. 30 వేల మందికి ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్, తాగునీరు, టాయిలెట్లు వంటి సౌకర్యాలపై చర్చించారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement