ప్రజలు గజినీలు కాదు | Laxman fires on congress and chandrababu naidu | Sakshi
Sakshi News home page

ప్రజలు గజినీలు కాదు

Published Fri, Nov 2 2018 1:06 AM | Last Updated on Fri, Nov 2 2018 1:06 AM

Laxman fires on congress and chandrababu naidu - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుల అపవిత్రమైన కలయికపై తెలుగు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. తెలుగు ప్రజలు గజినీలేం కాదని, రాహుల్, బాబు విన్యాసాలకు ప్రజలు కొట్టే దెబ్బతో వారు రాజకీ యం మరిచిపోతారన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని బాబు రాహుల్‌ కాళ్ల వద్ద తాకట్టు పెట్టా రన్నారు.

తెలంగాణ ఎన్నిక ల్లో బీజేపీ కచ్చితంగా విజ యం సాధిస్తుందన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో జరిగిన బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాకు ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపింది. శుక్రవారం 28 మందితో కూడిన రెండో అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. రాహుల్‌ని కలసిన బాబు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని బీజేపీ నేత కిషన్‌రెడ్డి విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement