
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ నెల ఏడో తేదీన రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించేందుకు వీలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏడో తేదీన రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు.
మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. శుక్రవారం జరగననున్న పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని, ఓటు హక్కును పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం పిలుపునిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment