
సాక్షి, ముంబై : మహారాష్ట్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఆయన సతీమణి రశ్మీ ఠాక్రే, కుమారుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్యా ఠాక్రేతో కలిసి స్థానిక కార్యాలయంలో నామినేషన్ ప్రతాలను సమర్పించారు. మే 21న రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మండలి స్థానాలకు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఠాక్రే ఎన్నికల కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతు ప్రకటించడంతో ఆయన ఎన్నికల ఏకగ్రీవం కానుంది. ఆయన పోటీ చేసే స్థానానికి ఠాక్రే ఒక్కరు మాత్రమే నామినేషన్ వేశారు. (కరోనా కాలంలోనూ రాజకీయ సెగలు)
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏసభకూ పోటీ చేయకుండానే ఠాక్రే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మే 27లోపు మండలికి ఎన్నిక కాకపోతే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కరోనా కారణంగా తొలుత మండలి ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో ఎన్నికల నిర్వహణకు గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఉద్ధవ్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇక ఠాక్రేపై ఎవరూ పోటీచేయకుండా మహా వికాస్ ఆఘాడీ నేతలు సంప్రదింపులు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment