సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలస వస్తున్నారని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం కొడంగల్, దౌల్తాబాద్ మండలాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరారు.
డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, మంత్రి మహేందర్ రెడ్డి వీరికి టీఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ..ఎమ్మెల్యేలతో మొదలైన వలసలు ఇప్పుడు కిందిస్థాయి కార్యకర్తల వరకు చేరుకున్నాయని..తాజా చేరికలతో కొడంగల్‌లో కాంగ్రెస్, టీడీపీలు ఖాళీ అయ్యాయన్నారు. ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పార్టీలో చేరిన వారిలో కొడంగల్ జెడ్పీటీసీ శరణమ్మ, చిట్లపల్లి ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్ గౌడ్, దౌల్తాబాద్ మండల టీడీపీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, దౌల్తాబాద్ సర్పంచ్ పార్వతమ్మ, గుండెపల్లి సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, చంద్రకల్ సర్పంచి మాధవి, ఉప సర్పంచి ఆశన్న, మండల కో ఆప్షన్ సభ్యుడు జాకీర్ లు న్నారు. వీరితో పాటు కోస్గి మండలం చెన్నారానికి చెందిన మాజీ ఎంపీటీసీ చిన్నారెడ్డి, బిజ్జారం సర్పంచ్ కళావతి, వివిధ గ్రామ పంచాయతీల వార్డు సభ్యులు, పీఎసీఎస్‌ల డైరెక్టర్లు కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment